jaqueline fernandez: షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్

  • 'రేస్ 3' షూటింగ్ లో జాక్వెలిన్ కు ప్రమాదం
  • కంటికి స్వల్ప గాయం
  • అబుదాబీలో షూటింగ్

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ షూటింగ్ లో గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె కంటికి గాయమైంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'రేస్ 3' చిత్రం అబుదాబీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్బంగా నిర్మాత రమేష్ తౌరానీ మాట్లాడుతూ, జాక్వెలిన్ కు అయిన గాయం చిన్నదేనని చెప్పారు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని... త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటుందని తెలిపారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైసీ షా, తదితరులు నటిస్తున్నారు. రెమో డసౌజా దర్శకత్వం వహిస్తున్నాడు. 

More Telugu News