Narendra Modi: బీజేపీ ఎంపీలకు కొత్త టార్గెట్ విధించిన నరేంద్ర మోదీ

  • ప్రతి ఎంపీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాలన్న మోదీ
  • ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచన
  • బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోదీ టార్గెట్

బీజేపీ ఎంపీలంతా ట్విట్టర్ లో అధికారిక ఖాతాలు తెరవాలని ప్రధాన మోదీ ఆదేశించారు. ఒక్కో ఎంపీకి కనీసం మూడు లక్షల మంది ఫాలోయర్లు ఉండాలని టార్గెట్ విధించారు. ఢిల్లీలో ఈరోజు బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ఉపన్యసించారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శలను ఎండగట్టేందుకు ఎంపీలంతా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు.

వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాల అసత్యాలను తిప్పికొట్టేలా మన సందేశం ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. దాదాపు మూడు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. ఇందులో సోషల్ మీడియాను వినియోగించుకోవడంపైనే ఎక్కువ చర్చ జరిగింది. సమావేశం సందర్భంగా 43 మంది ఎంపీలకు ఫేస్ బుక్ ఖాతాలు లేవని తేలింది. అకౌంట్లు ఉన్నవారిలో కూడా 77 మంది అకౌంట్లకు వెరిఫికేషన్ పూర్తి కాలేదని తెలిసింది. 

More Telugu News