Telangana: ‘తెలంగాణ’లో కరెంట్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు : మంత్రి జగదీశ్‌రెడ్డి

  • సబ్ స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేస్తాం
  • గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు  
  • ఓపెన్ టెండర్ల ద్వారానే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం
  • శాసనసభలో మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విద్యుత్ అంశంపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సబ్ స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేస్తామని, అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల్లో లో-ఓల్టేజ్ సమస్య వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కాగా, ఓపెన్ టెండర్ల ద్వారానే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని, ఎన్టీపీసీ ద్వారా విద్యుత్ కొనుగోలుకు ధర ఎక్కువ చెల్లిస్తున్నామని జగదీశ్ రెడ్డి చెప్పారు. కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వ బకాయిలు ఉన్నాయనేది వాస్తవమని, విద్యుత్ బిల్లు చెల్లించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను జప్తు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, ప్రతి రాష్ట్రం ఉత్పత్తి చేసే దాంట్లో నిర్ణీత శాతం సౌరవిద్యుత్ ఉండాలనేది నిబంధన అని అన్నారు. ఉదయ్ పథకానికి సంబంధించి రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని, డిస్కమ్‌ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News