south states: కేంద్రంపై దక్షిణ భారత యుద్ధం.. భేటీకి వెళ్లేందుకు చంద్రబాబు అనుమతి కోరిన యనమల

  • దక్షిణాది ఆర్థిక మంత్రుల భేటీకి కేరళ పిలుపు
  • భేటీకి అనుమతి కోరిన యనమల
  • సుముఖత వ్యక్తం చేసిన చంద్రబాబు

నిధుల పంపకాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది నుంచి ఎక్కువ పన్నులు రాబడుతూ, నిధులు మాత్రం తక్కువగా ఇస్తున్నారంటూ దక్షిణాది ముఖ్యమంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు రావాలంటూ తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి ఆర్థిక మంత్రులకు కేరళ ఆర్థిక మంత్రి ఫోన్లు చేశారు. ఈ నేపథ్యంలో, భేటీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్థిక మంత్రి యనమల కోరారు. దానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు.

కేరళ ఆర్థిక మంత్రి తనకు ఫొన్ చేశారని ఈ సందర్భంగా చంద్రబాబుకు యనమల చెప్పారు. 2011 జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గిందని, ఇదే సమయంలో ఉత్తరాది జనాభా విపరీతంగా పెరిగిపోయిందని.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో జనాభా నియంత్రణ లేని రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తున్నాయని చెప్పారు.

More Telugu News