shivani: రాజమౌళి క్లాప్ తో మొదలైన రాజశేఖర్ కూతురు సినిమా

  • హిందీలో హిట్ కొట్టిన '2 స్టేట్స్'
  • అదే టైటిల్ తో తెలుగు రీమేక్ 
  • అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు

జీవిత రాజశేఖర్ దంపతుల కుమార్తె శివాని .. కథానాయికగా తెలుగు తెరకి పరిచయం కానుందనే వార్త కొంతకాలంగా షికారు చేస్తోంది. ఆమె తొలి సినిమా షూటింగ్ కొంతసేపటి క్రితం మొదలైంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ..  పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో, ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

 దర్శకులు కె. రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేయగా .. ముహూర్తపు సన్నివేశానికి రాజమౌళి క్లాప్ కొట్టారు. అడవి శేష్ .. శివానిలపై తొలిషాట్ ను చిత్రీకరించారు. కృష్ణంరాజు దంపతులు ఈ సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు అందజేశారు. హిందీలో వచ్చిన '2 స్టేట్స్' కి ఇది రీమేక్ .. అదే టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా, వెంకట్ కుంచం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.   

More Telugu News