Police: ఒక్కరోజు పోలీస్‌గా ఏడేళ్ల బాలుడు.. కల నిజం చేసిన పోలీసులు

  • కేన్సర్‌తో పోరాడుతోన్న ఏడేళ్ల అర్పిత్
  • పోలీస్ ఇన్‌స్పెక్టర్ కావాలని కోరిక
  • ముంబయి పోలీసులకు తెలిపిన ఓ ఎన్జీవో

కేన్సర్‌తో పోరాడుతోన్న ఏడేళ్ల బాలుడి కలను ముంబయి పోలీసులు ఈ రోజు నిజం చేశారు. ఆర్పిత్ అనే ఆ బాలుడికి పోలీస్ ఇన్‌స్పెక్టర్ కావాలనే కోరిక ఉండేది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ ఎన్‌జీవో.. ఆ బాలుడి గురించి ముంబైలోని ములంద్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని పోలీస్ స్టేషన్‌కి పిలిచి పోలీస్ ఇన్‌స్పెక్టర్ డ్రెస్ వేసి ఆ హోదాలో కూర్చోబెట్టారు. ఆ బాలుడిని ఒక్క రోజు పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను చేశామని ముంబయి పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆ బాలుడితో పలు పైళ్లపై సంతకాలు పెట్టిస్తున్నట్లు, తమ కొత్త బాస్‌కి సెల్యూట్ చేస్తున్నట్లు పోలీసులు తీసిన ఫొటోలపై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News