venkatesh: మల్టీస్టారర్ కోసం మామగా వెంకీ .. అల్లుడుగా చైతూ!

  • 'జై లవకుశ'తో హిట్ కొట్టిన బాబీ 
  • వెంకీ .. చైతూలతో మల్టీ స్టారర్ 
  • త్వరలో సెట్స్ పైకి  

వెంకటేశ్ .. నాగచైతన్య నిజ జీవితంలో మేనమామ .. మేనల్లుడు అనే సంగతి తెలిసిందే. ఇదే బంధంతో ఈ ఇద్దరూ ఇంతకు ముందు 'ప్రేమమ్' సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో వెంకటేశ్ ఆ పాత్రలో కొంతసేపు మాత్రమే కనిపించాడు. కానీ తాజా చిత్రంలో చైతూకి మేనమామగా పూర్తిస్థాయి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

వెంకటేశ్ .. నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ ఒక మల్టీ స్టారర్ ను చేయనున్నాడు. ఈ మధ్య 'జై లవకుశ' సినిమాతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు, ఆ తరువాత చేయనున్న సినిమా ఇదే. రీసెంట్ గా ఆయన చైతూ .. వెంకీలకు కథను వినిపించి ఓకే అనిపించుకున్నాడని సమాచారం. మేనమామ - మేనల్లుడి పాత్రలు నచ్చడం వల్లనే వాళ్లు ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం తేజ సినిమాతో వెంకటేశ్, చందూ మొండేటి .. మారుతి సినిమాలతో చైతూ బిజీగా వున్నారు. ఆ తరువాతనే బాబీ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని చెప్పుకుంటున్నారు.     

More Telugu News