electric: హైద‌రాబాద్‌లో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలు: శాసనసభలో మంత్రి కేటీఆర్

  • అత్యున్నత ప్రమాణాలతో పౌరసేవా కేంద్రాలు
  • హైదరాబాద్ ప్రజల కోసం 826 ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణం 
  • నాలుగేళ్లుగా భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్
  • 43 పట్టణాలకు రూ.వెయ్యి కోట్లకు పైగా నిధుల మంజూరు

హైద‌రాబాద్‌లో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలనుకుంటున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ... అత్యున్నత ప్రమాణాలతో పౌరసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ ప్రజల కోసం 826 ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణం చేస్తున్నామని  అన్నారు. నాలుగేళ్లుగా హైదరాబాద్ భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలుస్తోందని చెప్పారు.

గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవని, తాము 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. అలాగే మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించేందుకు తమ సర్కారు కృషి చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ తో పాటు వరంగల్‌లో వ్యర్థ పదార్థాల ప్లాంటు ఏర్పాటు చేస్తామని అన్నారు. హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు భారీగా తరలివస్తున్నాయని అన్నారు.

More Telugu News