Congress: లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్!

  • 27న చర్చ చేపట్టాలంటూ నోటీసు
  • ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ
  • చర్చను అడ్డుకోవద్దంటూ టీఆర్ఎస్, అన్నాడీఎంకేలకు విన్నవించిన కాంగ్రెస్

తెలుగుదేశం, వైసీపీ పోరుబాటలోకి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి చేరింది. ఇప్పటి వరకు ప్రేక్షకపాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని నోటీసు అందజేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడుతోందని తాము ముందు నుంచి చెబుతున్నా ఎవరూ నమ్మలేదని... ఇప్పటికైనా వారందరికీ అర్థమవుతుందని భావిస్తున్నామని తెలిపారు.

 టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలకు తాము ఓ విన్నపం చేస్తున్నామని... వెల్ లోకి వచ్చి ఆందోళన చేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చను అడ్డుకోవద్దని... మాట్లాడే అవకాశం మీకు వచ్చినప్పుడు, మీ సమస్యలను చెప్పుకోవాలని అన్నారు. విభజన హామీలను అమలు చేసి ఉంటే... ఈపాటికి ఏపీ బ్రహ్మాండంగా ఉండేదని తెలిపారు. 

More Telugu News