nagam: ఏ పార్టీలో చేరాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటా: నాగం జనార్దన్ రెడ్డి

  • టీఆర్ఎస్ నేతల అవినీతిపై చాలా సార్లు బీజేపీ నేతలకు  సమాచారమిచ్చా
  • అయినప్పటికీ ఫలితం లేదు
  • పోరాడుతున్న నాకు బీజేపీ నేతలు సహకరించట్లేదు
  • స్థానిక నేతలు టీఆర్ఎస్ తో లాలూచీపడ్డారు : నాగం

భారతీయ జనతా పార్టీ నుంచి బయటకొచ్చేసిన నాగం జనార్దన్ రెడ్డి తాను ఏ పార్టీ లో చేరాలనే విషయమై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్యకర్తల అభీష్టం మేరకు తాను బీజేపీని వీడానని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అవినీతిపై చాలా సార్లు ఆధారాలతో సహా బీజేపీ నేతలకు తాను సమాచారమిచ్చానని, అయినప్పటికీ ఫలితం లేదని అన్నారు.

టీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేతలు గట్టిగా పోరాటం చేయట్లేదని, దీంతో, బీజేపీ వైఖరి తనకు నచ్చలేదని విమర్శించారు. టీఆర్ఎస్ నేతల అవినీతిపై వ్యక్తిగతంగా పోరాటం చేస్తున్న తనకు బీజేపీ నేతలు సహకరించలేదని, ఈ విషయమై గట్టిగా పోరాటం చేయాలని అధిష్ఠానం చెప్పినా, స్థానిక నేతలు టీఆర్ఎస్ తో లాలూచీపడ్డారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తనకు ఇప్పటికే ఆహ్వానం అందిందని, కాంగ్రెస్ పార్టీ నేతలెవ్వరూ తనను వ్యతిరేకించరని నాగం అభిప్రాయపడ్డారు.

More Telugu News