airindia: మొట్టమొదటిసారి సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌ వెళ్లిన ఎయిరిండియా విమానం

  • తమ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ వెళ్లేందుకు సౌదీ అరేబియా అనుమతి
  • సుమారు రెండు గంటలు తగ్గిన ప్రయాణ సమయం 
  • తగ్గిన ఇంధన ఖర్చు  

భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య బంధం మరింత బలోపేతమవుతోంది. భారత విమానయాన సంస్థ ఎయిరిండియా మొదటిసారిగా సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌కు చేరుకుంది. మామూలుగా తమ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ వెళ్లేందుకు సౌదీ అరేబియా అనుమతి ఇవ్వదు. అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలు ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించకపోవడమే అందుకు కారణం. కాగా, ఇటీవల భారత్ కోసం నిబంధనలు సడలించిన సౌదీ అరేబియా.. ఎయిరిండియాకు తమ గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

దీంతో ప్రయాణ సమయం సుమారు రెండు గంటలు తగ్గింది. తద్వారా ఇంధన ఖర్చు కూడా బాగా తగ్గింది. ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్‌కు సౌదీ అరేబియా మీదుగా తొలిసారి విమానం వచ్చిన సందర్భంగా ఇజ్రాయెల్‌ పర్యాటక మంత్రి యారివ్‌ లెవిన్ మాట్లాడుతూ... ఇది చారిత్రక ఘటన అని, భారతీయ పర్యాటకులు తమ దేశం రావాలని, అలాగే ఇజ్రాయెల్ ప్రజలు భారత్‌కు అధిక సంఖ్యలో వెళ్లాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 

More Telugu News