shivaji: ఆపరేషన్ 'ద్రవిడ' అవాస్తవం.. ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథనం: బీజేపీ

  • పట్టిసీమ మంచి ప్రాజెక్టే.. కానీ, అవినీతి మాత్రం చోటు చేసుకుంది
  • చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నది అవాస్తవం
  • బాబు సీమ బిడ్డే అయితే.. ఆ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు?

దక్షిణ భారతదేశాన్ని కబళించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని... ఏపీ, తెలంగాణల్లో పీఠాన్ని కైవసం చేసుకోవడానికి 'ఆపరేషన్ ద్రవిడ'ను చేపట్టిందంటూ హీరో శివాజీ నిన్న సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిపిందే. ఏపీలో ఉన్న పార్టీలన్నింటినీ నిర్వీర్యం చేసేందుకు ఓ జాతీయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో శివాజీ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

ఆపరేషన్ గరుడ, ద్రవిడ అనేవి అవాస్తవాలని... ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథనాలని బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల అన్నారు. టీడీపీ నేతలు ఇటీవలి కాలంలో 'కుట్ర' అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక పార్లమెంటు సభ్యుడని... ప్రధాని కార్యాలయంలో ఆయన తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రానికీ పొడిగించలేదని చెప్పారు. ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను మాత్రమే విడుదల చేశామని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఏపీకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులను ఇచ్చిందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా అవాస్తవాలని సుధీశ్ రాంభొట్ల అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు చాలా గొప్పదని... అయితే, ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది మాత్రం వాస్తవమని తెలిపారు. చంద్రబాబు నాయుడు నిజంగా రాయలసీమ బిడ్డే అయితే... సీమను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. 

More Telugu News