Huawei: ప్రపంచంలో తొలి 512 జీబీ స్మార్ట్ ఫోన్... చైనా కంపెనీ హువావే తయారీ

  • 6జీబీ ర్యామ్, వెనుక మూడు కెమెరాలు
  • ఈ స్థాయి ఫీచర్లతో వస్తున్న తొలి ఫోన్
  • ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం

స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమదైన ఫీచర్లతో కస్టమర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనాకు చెందిన హువావే పి20 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఇందులో 512 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉండడం విశేషం. ఈ స్థాయి స్టోరేజీతో వస్తున్న తొలి ఫోన్ ఇది. ఇంత వరకు ఈ కంపెనీ గరిష్టంగా 250 జీబీ సామర్థ్యంతోనే ఫోన్లను అందిస్తోంది. 512 జీబీ సామర్థ్యం అంటే కంప్యూటర్ తో సమానం.

 ఇక పి20లో వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. సర్ఫేస్ ఆన్ లైన్ కూడా ఉంటుంది. 6జీబీ ర్యామ్ ను ఇందులో ఏర్పాటు చేసింది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది. ఒకవేళ ఈ స్థాయి స్టోరేజీ సామర్థ్యం, ఫీచర్లతో పి20ని కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తే గనుక మిగిలిన ప్రధాన కంపెనీలు సైతం ఈ తరహా ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News