hardik pandya: అంబేద్కర్ కు అవమానం ట్వీట్ పై హార్డిక్ పాండ్య వివరణ ఇదే!

  • అంబేద్కర్ అంటే చాలా గౌరవం
  • భారత రాజ్యాంగాన్ని కానీ, ఏదైనా వర్గాన్ని కానీ కించపరచలేదు
  • ఫ్యాన్స్ తో మమేకమయ్యేందుకే సోషల్ మీడియాను వాడతాను

భారత రాజ్యంగకర్త డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్‌ ని అవమానిస్తూ చేసిన ట్వీట్ పై టీంమిండియా క్రికెటర్ హర్థిక్ పాండ్యా ట్విట్టర్ లో వివరణ ఇచ్చాడు. ఆ ట్వీట్ తాను చేయలేదని స్పష్టం చేశాడు. అంబేద్కర్‌ ని అవమానపరుస్తూ, ట్వీట్‌ కానీ, వ్యాఖ్యలు కానీ తాను చేయలేదని ప్రకటించాడు. తన పేరిట ఉన్న ఫేక్ అకౌంట్ లో ఆ ట్వీట్ వచ్చిందని హార్డిక్ పాండ్య వెల్లడించాడు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాను మాత్రమే తాను వినియోగిస్తానని పాండ్య తెలిపాడు. డా.ఆంబేద్కర్ అంటే తనకు చాలా గౌరవమని చెప్పాడు.

భారత రాజ్యంగం గురించి కానీ, దేశంలో ఏ వర్గాన్ని గురించి కానీ కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదని పాండ్య స్పష్టం చేశాడు. సోషల్‌ మీడియాని ఫ్యాన్స్‌ తో నేరుగా మమేకమయ్యేందుకు, తనకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు మాత్రమే వినియోగిస్తానని పాండ్య తెలిపాడు. ఈ వివాదంలో కోర్టుకు అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కేవలం తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బ తీసేందుకే ఈ ట్వీట్ చేశారని పాండ్య తెలిపాడు. ఇలాంటి పరిస్థితిని ఇండియాలో ప్రతి సెలబ్రిటీ ఎదుర్కొంటాడని హార్డిక్ పాండ్య తెలిపాడు.

More Telugu News