Andhra Pradesh: ఏపీకి ఊరట.. పోలవరానికి నిధులు విడుదల చేసిన కేంద్రం

  • పోలవరాన్ని ఆపేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్న చంద్రబాబు
  • తొలి విడత సాయంగా రూ.1098 కోట్లు విడుదల
  • మరో రూ.302 కోట్లు విడుదల చేసే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరటనిచ్చే కబురు చెప్పింది. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా ప్రతిపక్షాలు, కేంద్రం అడ్డుకుంటున్నాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న తరుణంలో గురువారం సాయంత్రం కేంద్రం నిధులు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తొలి విడతగా రూ.1098 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. త్వరలోనే మరో రూ.302 కోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే నాబార్డు ద్వారా మరో రూ.1400 కోట్లను రుణంగా తీసుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతించింది.

వైసీపీ, జనసేనతో కుమ్మక్కైన బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఇటీవల తన దూకుడు పెంచింది. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన టీడీపీ, ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, అమరావతికి నిధుల కోసం పోరు ఉద్ధృతం చేసింది.

More Telugu News