gas: మరింత పెరగనున్న నేచురల్ గ్యాస్‌ ధరలు

  • వచ్చేనెల 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి అయ్యే నేచురల్‌ గ్యాస్‌ ధర పెంపు
  • ఒక్కో మిలియన్ బ్రిటన్ థర్మల్ యూనిట్‌ 3.06 డాలర్లకు చేరిక
  • ప్రస్తుతం నేచురల్ గ్యాస్ ధర 2.89 డాలర్లు

భారత్‌లో నేచురల్ గ్యాస్ ధర మరింత ప్రియం కానుంది. వచ్చేనెల 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి అయ్యే నేచురల్‌ గ్యాస్‌ ధర ఒక్కో మిలియన్ బ్రిటన్ థర్మల్ యూనిట్‌కు 3.06 డాలర్లకు పెరగనుందని, రెండేళ్ల గరిష్టానికి ధర చేరుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో సీఎన్‌జీ ధర, ఎలక్ట్రిసిటీ, యూరియా ఉత్పత్తి వ్యయాలపై కూడా ఈ భారం పడనుంది. ప్రస్తుతం నేచురల్ గ్యాస్ ధర 2.89 డాలర్లుగా ఉంది.

ఈ ధరల పెంపుతో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి వాటికి భారీగా రెవెన్యూ రానుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ధరలను నిర్ణయిస్తారు. ధరల పెంపు ప్రభావం సీఎన్‌జీపై పడడంతో నాటు, యూరియా, పవర్‌ ఉత్పత్తి వ్యయాల పెంపునకు కూడా కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News