kalyan ram: ఎన్నారై అమ్మాయిగా మీ అందరికీ నచ్చుతాను: కాజల్

  • 'ఎమ్మెల్యే'లో కథానాయికగా కాజల్ 
  • భారీస్థాయిలో రేపే రిలీజ్ 
  • హిట్ ఖాయమన్న కాజల్

'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మరోమారు ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్, ఈ మధ్యనే వచ్చిన 'అ!' సినిమాతోను సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆమె నటించిన 'ఎమ్మెల్యే' సినిమా .. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తాను .. ఈ పాత్ర మీ అందరికీ నచ్చుతుంది" అంది.

"చాలాకాలం తరువాత కల్యాణ్ రామ్ సరసన చేశాను .. పాత స్నేహితులం మళ్లీ కలుసుకున్నట్టుగా అనిపించింది. నటన పరంగా కల్యాణ్ రామ్ మంచి పరిణతిని సాధించాడు. 'ఎమ్మెల్యే' .. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రం .. ఇది తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి సైన్ చేసినట్టుగా చెప్పుకొచ్చింది.  

More Telugu News