ajith: భారీ యాక్షన్ నుంచి పాటల దిశగా అజిత్

  • అజిత్ తాజా చిత్రంగా 'విశ్వాసం'
  • హ్యాట్రిక్ హిట్ తరువాత మూవీ
  • పాట చిత్రీకరణలో అజిత్

తమిళంలో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే హీరోగా అజిత్ కి మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆయన 58వ సినిమా సెట్స్ పై వుంది. దర్శకుడు శివ 'విశ్వాసం' అనే పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇంతకుముందు షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగు జరుపుకుంటోంది.

అజిత్ పై ఒక పాటను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట తరువాత కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. 'వీరమ్' .. 'వేదాళం' .. 'వివేకం' హిట్స్ తరువాత శివ - అజిత్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'విశ్వాసం' పట్ల అందరిలోనూ ఆసక్తి వుంది.  

More Telugu News