Chandrababu: ఓ దొంగ, ఓ అవినీతిపరుడు మోదీని కలిస్తే.. మనమేం చెబుతాం?: చంద్రబాబు

  • అవినీతిపరుల మాటలనే బీజేపీ చెబుతోంది
  • తనపై దాడి చేయడమేనా ప్రజాస్వామ్యం అంటే?
  • హఠాత్తుగా బీజేపీ చేస్తున్న విమర్శల వెనుక ఉన్న కారణం ఏంటి?

పట్టిసీమ పనికి రాకుండా పోవడం, పోలవరం పూర్తి కాకూడదనేదే బీజేపీ కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కాగ్ రిపోర్టు ఆధారంగా ఎన్ని కేసులు వేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కాగ్ తప్పుబట్టిందని... మరి కేంద్రంపై కూడా కేసులు వేస్తారా? అని నిలదీశారు. మీ రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడవద్దని కోరారు. అన్ని విధాలుగా అవినీతిని అంతం చేయాలని తానే కోరుతున్నానని... పెద్ద నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.

ఓ దొంగ, ఓ అవినీతిపరుడు ప్రధాని మోదీని కలిస్తే... ఇక మనం చెప్పేదేముంటుందని విమర్శించారు. అవినీతిపరులు ఏం మాట్లాడుతున్నారో... బీజేపీ కూడా అదే మాట్లాడుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తనపై దాడి చేయడమేనా ప్రజాస్వామ్యమని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. శాసనమండలిలో పట్టిసీమపై బీజేపీ సభ్యుల ఆరోపణలపై స్పందిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్నటిదాకా బాగానే ఉన్న బీజేపీ సభ్యులు.. ఇప్పుడు హఠాత్తుగా ఆరోపణలు చేయడం వెనుక కారణమేంటని నిలదీశారు. 

More Telugu News