Andhra Pradesh: వాడపల్లి, పెబ్బేరు, కోదాడ వరకే ప్రయాణం... ఏపీ, తెలంగాణల మధ్య రాకపోకలు బంద్!

  • ఏపీలో జరుగుతున్న రహదారుల దిగ్బంధం
  • తెలంగాణ సరిహద్దుల వద్ద పోలీసు బందోబస్తు
  • సమ్మె ముగిసిన తరువాతే బస్సులను వదులుతామంటున్న పోలీసులు

 నేడు ఏపీలో జరుగుతున్న జాతీయ రహదారుల దిగ్బంధం సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న సరిహద్దుల వరకే తెలంగాణ బస్సులు తిరుగుతూ ఉండగా, ఏపీ నుంచి ఒక్క బస్సు కూడా తెలంగాణకు రావడం లేదు. సరిహద్దుల వద్ద ఎక్కడికక్కడ ఏపీ వైపు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

కర్నూలు సమీపంలోని పెబ్బేరు, సూర్యాపేట జిల్లాలోని కోదాడ; గుంటూరు, సూర్యాపేట జిల్లాలను కలిపే వాడపల్లి, నాగార్జున సాగర్ పైలాన్ వరకే తెలంగాణ బస్సులు వెళుతున్నట్టు సమాచారం. రహదారుల దిగ్బంధం మధ్యాహ్నం వరకూ కొనసాగుతుందని తెలుస్తుండటంతో, ఆందోళనకారులు రాస్తారోకోలను విరమించుకున్న తరువాతే బస్సులు సరిహద్దులు దాటేందుకు అనుమతిస్తామని బందోబస్తులో ఉన్న పోలీసులు చెబుతున్నారు.

More Telugu News