allu arjun: అమెరికాలో బన్నీ రొమాంటిక్ సాంగ్

  • ముగింపు దశలో 'నా పేరు సూర్య'
  • కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్,శరత్ కుమార్ 
  • ఏప్రిల్ రెండవ వారంలో ఆడియో రిలీజ్

అల్లు అర్జున్ అభిమానులంతా 'నా పేరు సూర్య' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగును చకచకా ముగించే పనిలో యూనిట్ సభ్యులు వున్నారు. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకు చాలా దగ్గరలో వుంది. ఒక పాటను అమెరికాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.

అల్లు అర్జున్ .. అనూ ఇమాన్యుయెల్ పై అమెరికాలో రేపటి నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించి, తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఒకే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.  

More Telugu News