jacky chan: 'మైడియర్ సోనూ! చిన్న బహుమతే' అంటూ గిఫ్ట్ పంపిన జాకీ చాన్

  • ‘కుంగ్‌ ఫూ యోగా’లో కలిసి నటించిన జాకీచాన్, సోనూసూద్
  • అప్పటి నుంచి కుదిరిన స్నేహం
  • జేసీ స్టంట్‌ టీమ్‌ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బహుమతి పంపిన జాకీ

మై డియర్ సోనూ! అంటూ బహుమతితో పాటు ఆత్మీయ లేఖను అంతర్జాతీయ స్టార్ జాకీ చాన్ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కి పంపాడు. ఇండో- చైనీ మూవీ ‘కుంగ్‌ ఫూ యోగా’లో జాకీచాన్ తో పాటు సోనూసూద్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరూ మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి వారిద్దరూ బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జాకీచాన్ (జేసీ) స్టంట్‌ టీమ్‌ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన లెదర్‌ జాకెట్‌ ను సోనూసూద్ బహుమతిగా పంపాడు.

 జాకెట్ తో పాటు ‘మై డియర్‌ సోనూ! ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న సోదరుల (స్టంట్ టీమ్) తో పాటు అతి కొద్ది మంది ఆత్మీయులకు మాత్రమే ఈ కానుక ఇస్తున్నాను. ఇది చిన్న కానుకే అయి ఉండవచ్చు కానీ దీనిని చూసిన ప్రతిసారీ నీకు నేను గుర్తొస్తాను. అప్పుడు నేను నీతోపాటుగా ఉన్నట్టు భావిస్తావు’ అంటూ భావోద్వేగపూరితమైన లేఖను కూడా పంపాడు. దీనిని అందుకున్న సోనూసూద్ మురిసిపోతున్నాడు. గతంలో ‘అయామ్‌ జాకీచాన్‌: మై లైఫ్‌ ఇన్‌ యాక్షన్‌’ అనే పుస్తకంతో పాటు, నీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ లేఖను పంపాడు.

More Telugu News