Congress: 'గతంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి' థర్డ్ ఫ్రంట్‌పై కేసీఆర్‌కి తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి బహిరంగ లేఖ

  • కేసీఆర్‌కి బెస్ట్ ఫ్రెండ్ అయిన మోదీ ఇప్పుడెందుకు శత్రువయ్యారు?
  • కేసీఆర్, చంద్రబాబు, లెఫ్ట్ పార్టీలన్నీ కలసి మహా కూటమి కట్టినప్పుడు ఏం జరిగింది?
  • సంకీర్ణ రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు రాచపుండులాంటివి
  • ఈ విషయం చాలా సార్లు రుజువయింది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై కేసీఆర్‌కి తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి శ్రవ‌ణ్ దాసోజు బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్‌కి బెస్ట్ ఫ్రెండ్ అయిన మోదీ ఇప్పుడెందుకు శత్రువయ్యారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 2009లోనూ కేసీఆర్, చంద్రబాబు, లెఫ్ట్ పార్టీలన్నీ కలసి మహా కూటమి కట్టినప్పుడు ఏం జరిగిందో మర్చిపోయారా? అని అడిగారు. సంకీర్ణ రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు రాచపుండులాంటివన్న విషయం చాలా సార్లు రుజువయిందని తెలిపారు.

గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిన వాజ్‌పేయి, ఐకే గుజ్రాల్, దేవేగౌడ పాలనలో దేశంలో ఎంతగా అనిశ్చితి నెలకొందో, ప్రజలకేం మేలు జరిగిందో కేసీఆర్ గుర్తుచేసుకుంటే మంచిదని శ్రవ‌ణ్ దాసోజు అన్నారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే థర్డ్ ఫ్రంట్ రాజకీయాలపై చర్చించేందుకు రావాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని సవాల్ విసిరారు. అలాగే, రాష్ట్రంలో తాము చేస్తోన్న బస్సు యాత్రతో కేసీఆర్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని అన్నారు.

More Telugu News