Yeh Hai Mohabbatein: ఏలియన్‌ డాన్స్ చేసిన ప్రముఖ టీవీ నటి...వీడియో వైరల్

  • ఏలియన్‌ లాగా డాన్స్ చేసిన 'యే హై మొహబతేన్' నటి
  • ఫ్యాన్స్ కోసం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్
  • వీడియోని తెగ చూసేస్తున్న నెటిజన్లు

ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ 'యే హై మొహబతేన్' నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తాజాగా పోస్టు చేసిన ఓ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ ఏలియన్‌ చేసినట్లుగా ఆమె డాన్సు చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 35 లక్షల మందికి పైగా వీక్షించారు. 'యే హై మొహబతేన్' షూటింగ్ కోసం లండన్ వెళ్లిన సందర్భంగా ఆమె ఈ పోస్టు చేసింది. 'ఈ ఏలియన్‌తో కలిసి డాన్స్ చేసేంత వరకు ఇది నన్ను విడిచిపెట్టలేదు' అంటూ ఆమె సరదాగా ఈ వీడియోకి సంబంధించి ట్వీట్ చేసింది.

More Telugu News