jd chakravarti: జేడీ చక్రవర్తి 'ఉగ్రం' మోషన్ పోస్టర్ రిలీజ్

  • జేడీ చక్రవర్తి హీరోగా 'ఉగ్రం'
  • దర్శకుడిగా 'అమ్మ' రాజశేఖర్ 
  • వేసవిలో రిలీజ్ చేసే ఆలోచన

హీరోగా విభిన్నమైన పాత్రలను చేసిన జేడీ చక్రవర్తి, ఆ తరువాత దర్శకుడిగానూ ప్రయోగాలు చేశాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అంతగా ఆదరణ పొందకపోవడంతో, కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక డాన్స్ మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకుని, ఆ తరువాత దర్శకుడిగా మారిన 'అమ్మ' రాజశేఖర్ కూడా, సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు.

అలా కొంత గ్యాప్ తరువాత ఆయన జేడీ చక్రవర్తితో 'ఉగ్రం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఈ రోజున వదిలారు. ఈ పోస్టర్లో రఫ్ లుక్ తో జేడీ చక్రవర్తి కనిపిస్తున్నాడు. టైటిల్ ..  నేపథ్య సంగీతాన్ని బట్టి ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

More Telugu News