mammotty: ఆ షరతుపైనే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రను చేస్తానన్న మమ్ముట్టి!

  • వై.ఎస్. బయోపిక్ కి సన్నాహాలు 
  • ఆయన పాత్రలో మమ్ముట్టి 
  • జూన్ లో షూటింగ్ ప్రారంభం  

ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతూ ఉంటే, మరో వైపున వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కి సన్నాహాలు మొదలవుతున్నాయి. ఈ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని సంప్రదించారట. అయితే, తన పాత్రకి తనతోనే డబ్బింగ్ చెప్పిస్తానంటేనే చేస్తానని మమ్ముట్టి షరతు పెట్టారట. అందుకు ఈ సినిమా టీమ్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది.

 మమ్ముట్టికి తెలుగు బాగానే వచ్చు .. ఆయన వాయిస్ గంభీరంగా ఈ పాత్రకి సెట్ అవుతుంది కూడా. ఇక రాజశేఖర్ రెడ్డితో ముడిపడిన ఇతర పాత్రలకి కూడా ఇతర భాషా నటీనటులనే ఎక్కువగా తీసుకుంటున్నారట. ఈ ఏడాది జూన్ లో ఈ సినిమా షూటింగును ప్రారంభించి 100 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలనే ఆలోచనలో వున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేయవచ్చని అంటున్నారు.      

More Telugu News