Balakrishna: 100 కోట్లు కొల్లగొట్టిన కన్నడ మూవీపై దృష్టి పెట్టిన బాలయ్య?

  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు  
  • ఆ తరువాత మూవీ బోయపాటితో 
  • 'మఫ్టీ' రీమేక్ లో చేయాలనే ఆలోచన  

ప్రస్తుతం బాలకృష్ణ దృష్టి ఎన్టీఆర్ బయోపిక్ పైనే వుంది. ఆ దిశగా ఆయన సన్నాహాలు మొదలుపెట్టేశారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేస్తారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనే వుంది.

 ఈ నేపథ్యంలో బాలకృష్ణ మరో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. క్రితం ఏడాది డిసెంబర్లో కన్నడలో 'మఫ్టీ'అనే సినిమా వచ్చింది. శివరాజ్ కుమార్ హీరోగా చేసిన ఈ సినిమా, అక్కడ 100 కోట్లను సాధించింది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ లో చేయడానికి బాలకృష్ణ ఉత్సాహాన్ని చూపుతున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.   

More Telugu News