TRS: అవిశ్వాసంపై చర్చకు టీఆర్ఎస్ అడ్డు.. లోక్ సభలో ఆందోళనలు కొనసాగిస్తామన్న గులాబీ పార్టీ

  • ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తామన్న వినోద్
  • రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న ఎంపీ
  • అదే జరిగితే.. ఈరోజు కూడా సభ వాయిదా పడే అవకాశం

ఓవైపు థర్డ్ ఫ్రంట్ అంటూ... మరో పక్క అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా టీఆర్ఎస్ కేంద్రానికి సహకరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఛైర్లో స్పీకర్ కూర్చోక ముందే వెల్ లోకి వెళ్లి టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో, సభ ఆర్డర్ లో లేదని... అవిశ్వాసంపై చర్చను చేపట్టలేమని... సభను వాయిదా వేస్తున్నామని స్పీకర్ ప్రకటించడం జరుగుతోంది. అవిశ్వాసంపై చర్చ జరిగేలా సహకరించాలని టీఆర్ఎస్ ఎంపీలను టీడీపీ, వైసీపీ ఎంపీలు బ్రతిమిలాడినా... వారు తమ సొంత వైఖరిని కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ రోజు కూడా పార్లమెంటులో తమ ఆందోళనలను కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై తమ ఆందోళనలు కొనసాగుతాయని, తమ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు కొనసాగితే ఈ రోజు కూడా సభ వాయిదా పడే అవకాశం ఉంది. 

More Telugu News