sc sc atrocity: ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ప్రభుత్వాధికారులను వెంటనే అరెస్టు చేయొద్దు: సుప్రీంకోర్టు

  • తప్పనిసరిగా డీఎస్పీ స్థాయి అధికారితో ప్రాథమిక దర్యాప్తు
  • ముందస్తు బెయిల్ కూ అవకాశం
  • ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం

ఎస్సీ, ఎస్టీలపై వివక్ష, దాడుల నుంచి రక్షణ కల్పించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తీవ్రంగా దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాధికారులపై అలాంటి కేసులు దాఖలైన సందర్భాల్లో వారిని వెంటనే అరెస్టు చేయవద్దని మంగళవారం ఆదేశించింది.

కేసులు దాఖలైన సమయంలో తొలుత డీఎస్పీ ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారితో ప్రాథమిక దర్యాప్తు జరిపించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ యు.యు.లలిత్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా కేసులు నమోదైన సందర్భాల్లో సంబంధిత ప్రభుత్వాధికారులు ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి అడ్డంకి ఉండదని.. వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

More Telugu News