no confidence motion: చేతులెత్తి దండం పెట్టినా టీఆర్ఎస్ ఎంపీలు వినలేదు: వైవీ సుబ్బారెడ్డి

  • కాసేపు సహకరించాలని చేతులు జోడించి అడిగాం
  • వాళ్ల సమస్యలపై వారు పోరాడుతున్నామని చెప్పారు
  • రేపైనా సభ సజావుగా జరుగుతుందని ఆశిద్దాం

కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అడ్డంకులు కల్పించవద్దని, చర్చ జరిగేందుకు సహకరించాలని టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలకు చేతులు జోడించి వేడుకున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలకు సంబంధించిన సమస్య అని... చర్చ కోసం స్పీకర్ అనుమతించే సమయంలో ఆందోళనలు చేపట్టకుండా, ఐదు నిమిషాల పాటు సహకరించాలని వేడుకున్నామని... అయినా వారు తమ ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని అన్నారు.

కావేరీ వివాదం 70 ఏళ్లుగా ఉందని... దానిపై తాము పోరాడుతున్నామని అన్నాడీఎంకే ఎంపీలు చెబుతున్నారని చెప్పారు. వారి సమస్యలపై వారు పోరాటం చేయడంలో తప్పు లేదని... వారి సమస్యలను వారు పోరాటం చేస్తుంటే మనం ఆపలేమని అన్నారు. కనీసం రేపైనా సభ సజావుగా సాగుతుందని ఆశిద్దామని చెప్పారు. 

More Telugu News