flipkart amazon: విక్రేతలకు పిచ్చెక్కిస్తున్న ఫ్లిప్ కార్ట్ కొత్త పాలసీ... డిస్కౌంట్ల భారం నెత్తినేసుకోవాలంటూ సెల్లర్లను కోరుతున్న సంస్థ!

  • డిస్కౌంట్ల భారం వదిలించుకునే యత్నం
  • 60 శాతం భరించాలని సెల్లర్లను కోరిన సంస్థ
  • 40 శాతం తాను భరిస్తానని ప్రతిపాదన

తరచూ భారీ సేల్స్ మేళాలు నిర్వహిస్తూ కస్టమర్లకు గాలం వేసేందుకు ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమేజాన్, పేటీఎం మాల్ ప్రయత్నిస్తున్న విషయం కళ్లకు కడుతోంది. ఆన్ లైన్ షాపింగ్ లో తగ్గింపు ధరలపై వస్తేనే కస్టమర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. లేదంటే ఆఫ్ లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపే పరిస్థితి ఉంది. అయితే, ఇన్నాళ్లూ భారీ డిస్కౌంట్ల భారాన్ని ఫ్లిప్ కార్ట్ స్వయంగా భరించి తన మార్కెట్ ప్లేస్ లో వస్తువులను అమ్మకానికి పెట్టిన వారికి వారు చెప్పిన ధర చెల్లించేది. కానీ, ఇప్పుడు ఆ తగ్గింపు భారాన్ని పంచుకోవాలని ఫ్లిప్ కార్ట్ కోరడంతో సెల్లర్లకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

ఈ మేరకు ఇటీవల సెల్లర్లకు ఫ్లిప్ కార్ట్ నుంచి సమాచారం అందింది. నిజానికి ఇంత కాలం ఫ్లిప్ కార్ట్, అమేజాన్ ఎప్పటికప్పుడు తాజా నిధులను సమీకరించడం ద్వారా ప్రచారం, డిస్కౌంట్ల పేరిట మంచినీళ్లలా వాటిని ఖర్చు చేశాయి. దీని ద్వారా అవి అగ్ర స్థాయి కంపెనీలుగా అవతరించాయి. అయినప్పటికీ భారీ తగ్గింపులు లేకుండా విక్రయాలు సాగించలేని పరిస్థితి నెలకొనడంతో ఆ భారాన్ని తగ్గించుకోవడమెలాగన్న దానిపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ‘‘తగ్గింపు మొత్తంలో 60 శాతాన్ని మీరు భరించండి. మిగిలిన 40 శాతాన్ని మేం భరిస్తాం’’ అంటూ ఫ్లిప్ కార్ట్ సెల్లర్లను కోరడం గమనార్హం.

More Telugu News