IOC: ఇండియన్ ఆయిల్ నయా ఆలోచన... ఇక పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ

  • ఐఓసీ మరో వినూత్న సేవ
  • ఇంటివద్దకే పెట్రో ఉత్పత్తులు
  • డెలీవరీ చార్జీలు, ధరపై మరింత స్పష్టత ఇవ్వని ఐఓసీ

ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరో వినూత్న సేవను ప్రారంభించింది. ఇంటి వద్దే ఇంధనాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. ఇకపై పెట్రోలు, డీజిల్ ను ఇంటి వద్దే అందిస్తామని పేర్కొంది. పెట్రోలు బంకులకు దూరంగా ఉండే ప్రాంతాలతో పాటు గ్రామాలకు ఈ నూతన సేవలు ఉపయుక్తకరంగా ఉంటాయని తెలిపింది.

కాగా, ఇంటివద్దే అందించే పెట్రో ఉత్పత్తులపై మరిన్ని వివరాలు, విధివిధానాలు తెలియాల్సి వుంది. సాధారణ ధరకే పెట్రోల్ ఇస్తారా? సేవా చార్జీలు వసూలు చేస్తారా? డెలివరీ చార్జ్ ఎంతుంటుంది? ఎప్పటి నుంచి ఈ సర్వీస్ మొదలవుతుంది? తదితర విషయాలపై ఐఓసీ స్పష్టత ఇవ్వాల్సి వుంది.

More Telugu News