Maharashtra: కార్యకర్త మరణంపై శివసేన ఎందుకు స్పందించడం లేదు?: కాంగ్రెస్

  • ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడిన రాహుల్ ఫలాకే
  • నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఫేస్ బుక్ పోస్టు
  • శివసేన మౌనం వెనుక కారణాలేంటి?

నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగానే తనువు చాలిస్తున్నానంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి ఈ నెల 16న కరద్ జిల్లాకు చెందిన శివసేన కార్యకర్త రాహుల్ ఫలాకే ఆత్మహత్యకు పాల్పడడంపై మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌ శివసేనను నిలదీశారు. ఎన్డీయే సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమాయకులు బలవుతున్నా శివసేన ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్డీఏ మిత్రపక్షం టీడీపీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టినా శివసేన కేంద్రానికి ఎందుకు మద్దతిస్తోంది? అని ఆయన ఉద్ధవ్‌ ఠాక్రేను నిలదీశారు. నోట్ల రద్దు, జీఎస్టీలే కారణమని శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడినా శివసేన మౌనంగా ఉండడం వెనుక కారణాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News