Undavalli: ఎక్కువ మంది నిజాయతీపరులు ఉన్నది పాలిటిక్స్ లోనే : ఉండవల్లి అరుణ్ కుమార్

  • రాజకీయనాయకులందరూ అవినీతి పరులని అనుకోవద్దు
  • ఎన్నికల్లో నేనెప్పుడూ డబ్బులు ఖర్చుపెట్టలేదు
  • ఎందుకంటే, నా నుంచి ప్రజలు డబ్బులు ఆశించలేదు : ఉండవల్లి

పొలిటీషియన్ అనే వాడే ఎక్కువ అవినీతికి పాల్పడతాడనేది తప్పుడు ఆలోచన అని, ఎక్కువ మంది నిజాయతీ పరులు ఉన్నది ‘పాలిటిక్స్’లోనే అని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, ఫోర్ట్ ఎస్టేట్. ఈ నాల్గింటిలో ఎక్కువ మంది నిజాయతీ పరులు ఉన్నది పాలిటిక్సే లోనే.

సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్, ఎమ్మెల్యే.. అవుదామనో తిరిగే వాళ్లు చాలా మంది ఉంటారు. వీళ్లందరూ అవినీతిపరులని అనుకోవద్దు. తమ ఇళ్లల్లో డబ్బులు తీసుకువచ్చి పెట్టి పెట్టి తిరిగేవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎన్నికైన తర్వాత ఎందుకు అవినీతికి పాల్పడతారంటే.. వచ్చే ఎన్నికల్లో నెగ్గాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలిగా, అందుకని!  నా విషయానికొస్తే, నేను ఎప్పుడూ డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే, నా నుంచి ప్రజలు డబ్బులు ఆశించలేదు. నా దగ్గర డబ్బులు లేవని అందరికీ తెలుసు. నాకు అదే మంచిదని అనిపించింది’ అని అన్నారు.

More Telugu News