Undavalli: జగన్ పై మొత్తం పెట్టిన చార్జి షీట్ల విలువ రూ.1300 కోట్లు!: ఉండవల్లి అరుణ్ కుమార్

  • వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తినేశాడనడం కరెక్టు కాదు
  • అతనిపై 13 వందల కోట్లకు సంబంధించి 11 చార్జి షీట్లు ఉన్నాయి
  • అందులో, రూ.500 కోట్లు క్లియర్ అయిపోయాయి
  • ఇంకా క్లియర్ కావాల్సింది రూ.800 కోట్లు : ఉండవల్లి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తినేశాడంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో నానా యాగీ చేసే వాళ్లని ప్రముఖ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అసలు, జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం పెట్టిన చార్జిషీట్ల విలువ రూ.1300 కోట్లు. అతనిపై పదమూడు వందల కోట్లకు సంబంధించి పదకొండు చార్జి షీట్లు ఉన్నాయి.

ఈ మధ్య ఎయిర్ పోర్ట్ లో జగన్ కలిసినప్పుడు మాట్లాడాడు. ‘అన్నా, రూ.1300 కోట్లు అంటున్నావు.. అందులో, రూ.500 కోట్లు క్లియర్ అయిపోయాయి. ఇంకా, ఉన్నది రూ.800 కోట్లే’ అని నాతో అన్నాడు. రూ.800 కోట్లు ఎక్కడ.. లక్ష కోట్లు ఎక్కడ? నేను అయితే, జగన్ మోహన్ రెడ్డికి ఏం సలహా ఇస్తానంటే.. ‘నీ కేసులన్నీ కూడా పబ్లిక్ ముందు పెట్టవయ్యా’ అని చెబుతాను. అనేక సార్లు జగన్ మోహన్ రెడ్డికి, వాళ్ల పార్టీ వాళ్లకు కూడా చెప్పాను. ఈ విషయాన్ని ఒకసారి అసెంబ్లీలో జగన్ చెప్పాడట.. అది నేను వినలేదు’ అని అన్నారు.

More Telugu News