whatsapp: మరో కొత్త ఫీచర్ తో వచ్చిన వాట్సాప్!

  • 'గ్రూప్ డిస్క్రిప్షన్' పేరిట కొత్త ఫీచర్
  • ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో కూడా లభ్యం
  • డిస్క్రిప్షన్ లెంగ్త్ 512 అక్షరాలు

ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 'గ్రూప్ డిస్క్రిప్షన్' పేరిట మరో కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. గత నెల నుంచి ఆండ్రాయిడ్ బీటాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇపుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో కూడా లభ్యం కానుంది. ఈ గ్రూప్ డిస్క్రిప్షన్ సదుపాయం వల్ల వాట్సాప్ గ్రూప్ లో ఉన్న సభ్యులు డిస్క్రిప్షన్ ని ఎడిట్ చేయడంతో పాటు ఎప్పుడైనా చదవుకోవచ్చు. ఈ ఫీచర్ లో నియమ నిబంధలను అలాగే ఇతర సమాచారాన్ని కూడా డిస్క్రిప్షన్ గా పెట్టుకోవచ్చు. దీనివల్ల గ్రూప్ లో మరో రకమైన సమాచారాన్ని పోస్ట్ చేయకుండా కొంత వరకు స్పాం మెసేజ్ లను నిరోధించవచ్చు. అలాగే డిస్క్రిప్షన్ 512 అక్షరాల లెంగ్త్ వరకు రాసే వెసులుబాటు ఉంది.

'గ్రూప్ డిస్క్రిప్షన్' ని ఇలా అప్డేట్ చేయండి:

  • ముందుగా మీరు వాట్సాప్ ని లేటెస్ట్ వెర్షన్ లోకి అప్డేట్ చేయాలి
  • మీ ఫోన్ లో వాట్సాప్ ని ఓపెన్ చేసి ఏదైనా 'గ్రూప్ పేరు' మీద నొక్కండి
  • తర్వాత కుడి వైపు కార్నర్ లో మూడు చుక్కలు గల ఆప్షన్ ని ఎంచుకోండి
  • అక్కడ కనిపించే ఆప్షన్ లలో 'Group Info' ను ఎంచుకోండి  
  • వెంటనే మీకు 'Add group description' ఆప్షన్ కనిపిస్తుంది, దానిలో మీ గ్రూప్ కి సంబంచిన 'డిస్క్రిప్షన్' ని రాయండి

More Telugu News