vijay devarakonda: విజయ్ దేవరకొండ ఫస్టులుక్ వచ్చేస్తోంది

  • విజయ్ దేవరకొండ హీరోగా రొమాంటిక్ థ్రిల్లర్ 
  • పరిశీలనలో 'టాక్సీ వాలా' టైటిల్ 
  • ఈ నెల 23న ఫస్టులుక్ రిలీజ్

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'టాక్సీవాలా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇందులో కథానాయకుడు టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు గనుక, ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది.

 ఈ సినిమా నుంచి ఇంతకుముందే ప్రీ లుక్ వచ్చేసింది. దాంతో అభిమానులంతా ఫస్టులుక్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఫస్టులుక్ ను వదలాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రియాంక జవల్కర్ కథానాయికగా అలరించనుంది. ఫస్టులుక్ తో విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో సందడి చేస్తాడో చూడాలి మరి. 

More Telugu News