Rajamouli: రంగస్థలం 'చిట్టిబాబు'పై రాజమౌళి అభిప్రాయం ఇది!

  • 'రంగస్థలం' ట్రైలర్ విడుదల
  • చిట్టిబాబుపై ఆప్యాయత పెరిగింది
  • సినిమా కోసం ఎదురు చూస్తున్నానన్న రాజమౌళి

నిన్న 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సినిమా థియేటరికల్ ట్రైలర్ ను విడుదల చేయగా, దాన్ని చూసిన దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, చిట్టిబాబు తనకు మరింత దగ్గరయ్యాడని, ఈ ట్రైలర్ చూసిన తరువాత అతనిపై తనకున్న ఆప్యాయత మరింతగా పెరిగిందని అన్నారు. జగపతి బాబు పాత్ర కూడా బాగుందని, ఈ సినిమా రిలీజ్ కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. రాజమౌళి ఈ ఉదయం 11.21 గంటల సమయంలో పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా, వేల మంది లైక్స్ కొడుతున్నారు.

More Telugu News