Niti Aayog: బీజేపీ పాలనలో గుజరాత్ వెనుకబడిన రంగాలివే: నీతి అయోగ్ కీలక నివేదిక

  • విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకంజ
  • పారిశ్రామిక, ఇంధన విభాగాల్లో అభివృద్ధి
  • విద్యాభివృద్ధికి మరిన్ని నిధులు
  • గుజరాత్ కు నీతి అయోగ్ సలహా

భారతీయ జనతా పార్టీ పాలనలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, ఇంధన విభాగాల్లో అభివృద్ధి సాధించిన గుజరాత్, విద్య, ఆరోగ్య రంగాల్లో మాత్రం వెనుకబడిందని నీతి ఆయోగ్ కీలక నివేదికను అందించింది. గాంధీనగర్ కు వచ్చిన సీఎం విజయ్ రూపానితో చర్చించిన నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆరోగ్యం, విద్య రంగాలను మెరుగు పరిచేందుకు కేటాయింపులు పెంచాలని సూచించానని, అందుకు విజయ్ రూపానీ అంగీకారం తెలిపారని అన్నారు. ఈ రెండు విభాగాల్లో పురోగతి సాధించే దిశగా ప్రత్యేక దృష్టి సారించి, కృషి చేయాలని కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర తీర ప్రాంతంలో ప్రత్యేక సెజ్ లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాయం చేసేందుకు నిర్ణయించామని అన్నారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుజరాత్ లో సక్రమంగా అమలు చేస్తున్నారని, పథకాల లబ్ది పేదలకు చేరుతోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.

More Telugu News