Hampi: తుంగభద్ర నదిలో శివలింగానికి అభిషేకం చేస్తున్న గజ'లక్ష్మి'...చూడండి!

  • హంపి విరూపాక్ష ఆలయానికి చెందిన ఏనుగు లక్ష్మి
  • తుంగభద్రలో స్నానానికి తీసుకెళ్లగా శివలింగానికి అభిషేకం
  • భక్తులను విశేషంగా ఆకర్షించిన గజ జలాభిషేకం

లక్ష్మి... కర్ణాటకలోని హంపిలో కొలువైన విరూపాక్ష ఆలయానికి చెందిన ఏనుగు. తుంగభద్రా నదిలో లక్ష్మిని స్నానం చేయించేందుకు తీసుకెళ్లిన వేళ... నదిలో అనుక్షణం జలాభిషేకంతో ఉండే శివలింగానికి తనవంతు అభిషేకం చేసింది. నిన్న జరిగిన ఈ ఘటన అక్కడున్న భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షించింది. పరమ శివుడు ప్రకృతిలో మమేకం కాగా, ఆయనంటే జంతువులకూ ఎంత ఇష్టమో చెప్పకనే చెబుతున్న ఆ దృశ్యాన్ని మీరూ చూడండి. పరమశివుడు పంచభూతాలకూ అధిపతి అనడంలో సందేహం ఏముంటుంది?

More Telugu News