Mahesh Babu: ఉగాది స్పెషల్... పంచెకట్టులో 'సీఎం భరత్'గా మహేశ్!

  • ఉగాది రోజున 'భరత్ అనే నేను' చిత్రం పోస్టర్ విడుదల
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వైనం
  • ఏప్రిల్ 20న సినిమా విడుదల

దర్శకుడు కొరటాల శివ-సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం పోస్టర్‌ను ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలుపెట్టేశారు.

అందులో భాగంగానే ఈ రోజు ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తెల్లని సంప్రదాయ దుస్తుల్లో మహేశ్ చూడచక్కగా ఉన్నాడంటూ ఇప్పటికే పలువురు ఈ పోస్టర్‌కు తెగ లైక్‌లు కొడుతూ షేర్ చేసేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఏప్రిల్ 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News