శశికళ భర్త పరిస్థితి విషమం... ఏమీ చెప్పలేమంటున్న వైద్యులు!

18-03-2018 Sun 10:24
  • నిన్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక
  • ఐసీయూలో ఉంచి చికిత్స
  • 48 గంటలు గడిస్తేనే అంటున్న వైద్యులు
నిన్న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు లివర్ సమస్యలు కూడా ఉన్నాయని, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, 48 గంటలు గడిస్తేగానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు రాలేమని వెల్లడించారు. నిన్న సాయంత్రం తనకు ఛాతీలో నొప్పిగా ఉందని ఆయన చెప్పడంతో బంధువులు ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. భర్త అనారోగ్యం గురించి తెలుసుకున్న శశికళ, తనకు పెరోల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.