శశికళ భర్త నటరాజన్ కు గుండెపోటు

18-03-2018 Sun 07:18
  • చెన్నై గ్లోబల్ ఆసుపత్రికి తరలించిన బంధువులు
  • ఐసీయూలో చికిత్స
  • పెరోల్ కోసం శశికళ దరఖాస్తు
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శశికళ భర్త నటరాజన్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను చెన్నై గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స జరుగుతోంది. విషయం తెలుసుకున్న శశికళ, తన భర్తకు తీవ్ర అనారోగ్యం ఉన్న కారణంగా, తన అవసరం ఆయనకు ఉందని, పెరోల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఒకసారి ఆమె భర్త అనారోగ్యం పేరిట పెరోల్ పై బయటకు వచ్చారు. ఆ సమయంలో ఆమె ఆసుపత్రిలో కాకుండా, రాజకీయ భేటీలకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.