kalyanram: మల్టీ స్టారర్ కి ఓకే చెప్పిన కల్యాణ్ రామ్

  • మల్టీ స్టారర్ లో కల్యాణ్ రామ్ 
  • మరో హీరో ఎవరనేది సస్పెన్స్ 
  • దర్శకుడిగా పవన్ సాదినేని పేరు

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రేక్షకులను పలకరించడానికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తాయనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాను ఓ మల్టీ స్టారర్ సినిమాను చేయనున్నట్టు చెప్పాడు.

 కొంతకాలం క్రితం ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ - సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తి కారణంగానే ఆ మల్టీ స్టారర్ ఆగిపోయిందని చెప్పిన కల్యాణ్ రామ్, త్వరలో మరో మల్టీ స్టారర్ చేయనున్నానని అన్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడెవరో .. మరో హీరో ఎవరో అనే విషయాన్ని ఆయన సస్పెన్స్ లో పెట్టేశాడు. ఆ విషయం అటుంచితే .. దర్శకుడిగా పవన్ సాదినేని పేరు మాత్రం వినిపిస్తోంది.       

More Telugu News