Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కి వర్ష సూచన

  • చల్లబడిన వాతావరణం
  • కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం పడే అవకాశం
  • ఉరుములు-మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సూచన  

కొన్ని రోజులుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసులకు ఈ రోజు కొంత ఉపశమనం లభించింది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చల్లబడింది. రెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల ఉరుములు-మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. 

More Telugu News