polavaram: పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కుట్ర: మంత్రి దేవినేని

  • స్వచ్ఛంద సంస్థల ముసుగులో కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు
  • మాపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు
  • పోలవరంపై ఏ విచారణకైనా సిద్ధం  

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ రోజు ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ... తమపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కొందరు కోరుతున్నారని, తాము పోలవరంపై ఏ విచారణకైనా సిద్ధమని, ప్రాణత్యాగం చేసైనా ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ చేయించిన ఫిర్యాదుల కారణంగానే పోలవరం ఆలస్యం అవుతోందని తెలిపారు. పోలవరం పనులు ఇప్పటివరకు 54.4 శాతం పూర్తయ్యాయని వివరించారు.    

More Telugu News