dravidian nadu: దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిసి 'ద్రవిడియాన్ నాడు' గా ఏర్పడితే స్వాగతిస్తా :స్టాలిన్

  • ఉత్తరాది డామినేషన్ పై దక్షిణాదిన పెరుగుతున్న అసహనం
  • ద్రవిడియన్ నాడును స్వాగతిస్తానన్న స్టాలిన్
  • ఆ పరిస్థితి వస్తుందనే భావిస్తున్నానన్న డీఎంకే నేత

దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక్కటవ్వాలనే ఆకాంక్షను డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ వెలిబుచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు 'ద్రవిడియన్ నాడు'గా ఒక్కటయ్యే పరిస్థితి వస్తే మీ స్పందన ఏమిటనే ఓ ప్రశ్నకు బదులుగా ఆయన ఈ విధంగా స్పందించారు. తమిళనాడులోని ఈరోడ్ లో ఆయన మాట్లాడుతూ, నిజంగా అదే జరిగితే తాను మనస్పూర్తిగా స్వాగతిస్తానని చెప్పారు. ఆ పరిస్థితి వస్తుందనే తాను భావిస్తున్నానని తెలిపారు. అయితే ద్రవిడియన్ నాడు కోసం ప్రచారం చేస్తానని తాను చెప్పడం లేదని అన్నారు.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయనే భావన దక్షిణాది ముఖ్యమంత్రులు, నేతలు, ప్రజల్లో బలంగా ఉంది. ఇదే విషయాన్ని చంద్రబాబు, కేసీఆర్, జయలలిత తదితర నేతలంతా ఇది వరకే చెప్పారు. రెండ్రోజుల క్రితం సిద్ధరామయ్య కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దేశానికి ఎక్కువ పన్నులు దక్షిణాది రాష్ట్రాలే కడుతున్నా... కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం నామమాత్రంగానే వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News