palaniswamy: టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు.. అన్నాడీఎంకేలో ముసలం!

  • టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన కేసీ పళనిస్వామి
  • వేటు వేసిన ఓపీఎస్, ఈపీఎస్
  • మోదీకి భయపడే వేటు వేశారంటూ ఆగ్రహం
  • పార్టీలో చీలిక రాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం అన్నాడీఎంకేలో వేడి పుట్టించింది. వివరాల్లోకి వెళ్తే, ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి కేసీ పళనిస్వామి నిన్న మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీనిపై ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. కేసీ పళనిస్వామిపై వేటు వేసింది. ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో కేసీ పళనిస్వామి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలపై మండిపడ్డారు. వీరిద్దరి బండారం బయటపెడతానని చెప్పారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించే అధికారం వీరికి లేదని మండిపడ్డారు. పార్టీలో చీలిక రాబోతోందని అన్నారు. కావేరి మండలి ఏర్పాటుకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని... ఈ నేపథ్యంలో టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వక తప్పదని అన్నారు. మోదీకి భయపడే తనను ఈపీఎస్, ఓపీఎస్ లు పార్టీ నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News