PAYTM: పేటీఎం ద్వారా బంగారం పంపుకోవచ్చు... బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు!

  • గోల్డ్ గిఫ్ట్, గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ ప్రారంభం
  • కోరుకున్న మేరకు బంగారంలో పెట్టుబడులు
  • డిజిటల్ రూపంలో పేటీఎం నుంచే ఇతరులకు బంగారం పంపుకునే వీలు

పసిడి ప్రియులకు మరో రెండు రకాల సేవలను అందిస్తున్నట్టు పేటీఎం ప్రకటించింది. గోల్డ్ గిఫ్టింగ్, గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ ను వెల్త్ మేనేజ్ మెంట్ విభాగం ద్వారా అందిస్తున్నట్టు తెలిపింది. కస్టమర్లు 24 క్యారట్ల 999.9 స్వచ్ఛత బంగారాన్ని పేటీఎం ద్వారా ఒకరికి ఒకరు పంపించుకోవ్చని వెల్లడించింది. దీన్నే బహమతి సేవగా పేర్కొంది. పేటీఎం డిజిటల్, భౌతిక రూపంలో బంగారం కొనుగోలుకు ముందు నుంచి అవకాశం కల్పిస్తోంది. రూపాయి చార్జీ లేకుండానే డిజిటల్ రూపంలో ఉంచుకోవడం లేదా ఫిజికల్ గా కావాలంటే డెలివరీ తీసుకునే అవకాశం ఉంది.  

60 శాతం బంగారం కొనుగోళ్లు టైర్ 2, 3 పట్టణాల నుంచే ఉంటున్నాయని ఈ సంస్థ అంటోంది. కస్టమర్లు వీలైనప్పుడల్లా రూ.500 మొదలుకొని బంగారం కొంటున్నట్టు తెలిపింది. పేటీఎం గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ కింద కస్టమర్లు తమ పొదుపు అవసరాల మేరకు బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫలానా రోజు ఎంత మొత్తం విలువ గల బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారు తదితర వివరాలను నమోదు చేస్తే చాలు. సరిగ్గా అన్నిరోజులకు వారి ఖాతాలో ఆ లావాదేవీ జరిగిపోతుంది.

More Telugu News