Sri Lanka: ముక్కోణపు సిరీస్‌: బంగ్లాదేశ్‌ విజయలక్ష్యం 160 పరుగులు

  • కొలంబో వేదికగా తలబడుతోన్న బంగ్లాదేశ్, శ్రీలంక 
  • టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక
  • రాణించిన కుశాల్ పెరీరా (61), తిషారా పెరీరా (58)
  • బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్ రహ్మాన్‌కి రెండు వికెట్లు

శ్రీలంక‌లో భార‌త్, బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ముక్కోణ‌పు టీ20 జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు కొలంబో వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలబడుతున్నాయి. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ జట్టు శ్రీలంకను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో కుశాల్ పెరీరా 61, తిషారా పెరీరా 58 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో గుణతిలక 4, కుశాల్ మెండీస్ 11, ఉపుల్ తరంగ 5, షనక 0, జీవన్ మెండిస్ 3, ఉదన 7 (నాటౌట్), ధనంజయ 1 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో బంగ్లా ముందు శ్రీలంక 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

 శ్రీలంకకి ఎక్స్ ట్రాల రూపంలో మరో 9 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక జట్టు ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్ రహ్మాన్ రెండు వికెట్లు తీయగా, షకిబ్‌, మెహదీ హసన్‌, రుబెల్, సౌమ్య సర్కార్ చెరో వికెట్‌ పడగొట్టారు. 

More Telugu News